Home 2 దినవృత్తాంతములు 2:1 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 2 · Verse 1

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 2:1

సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని

Book: 2 Chronicles · Chapter: 2 · Verse: 1

Cross References

ద్వితీయోపదేశకాండము 12:5

మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను.

ద్వితీయోపదేశకాండము 12:11

నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.

ద్వితీయోపదేశకాండము 28:58

నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల

1 రాజులు 5:5

కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.

1 రాజులు 5:15

మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.

1 రాజులు 7:1

సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.

1 రాజులు 8:18

యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగానా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి యున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;

1 రాజులు 8:20

తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా సెలవుచొప్పున ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడనై యుండి, ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిర మును కట్టించియున్నాను.

1 రాజులు 9:1

సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత

1 దినవృత్తాంతములు 22:10

అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.

మత్తయి 6:9

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme