Home 2 దినవృత్తాంతములు 14:1 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 14 · Verse 1

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 14:1

అబీయా తన పితరులతో కూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.

Book: 2 Chronicles · Chapter: 14 · Verse: 1

Cross References

యెహోషువ 23:1

చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను.

1 రాజులు 2:10

తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.

1 రాజులు 14:31

రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మో నీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.

1 రాజులు 15:8

అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.

1 రాజులు 15:9

ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.

1 రాజులు 15:11

ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని

1 దినవృత్తాంతములు 3:10

అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు

2 దినవృత్తాంతములు 9:31

తరువాత సొలొ మోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

2 దినవృత్తాంతములు 21:12

అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెనునీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగానీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక

2 దినవృత్తాంతములు 31:20

హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.

మత్తయి 1:7

సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme