2 దినవృత్తాంతములు 13:22
అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్యను గూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడియున్నది.
2 దినవృత్తాంతములు 13:22
అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్యను గూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడియున్నది.
సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శి యైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.
రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.
అతని కుమారులను గూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయు టను గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.