Home 1 సమూయేలు 9:17 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 9 · Verse 17

తెలుగు బైబిల్

1 సమూయేలు 9:17

సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవాఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.

Book: 1 Samuel · Chapter: 9 · Verse: 17

Cross References

1 సమూయేలు 3:13

తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.

1 సమూయేలు 16:6

వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచినిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను

2 సమూయేలు 23:6

ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు.

నెహెమ్యా 13:19

మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.

నెహెమ్యా 13:25

అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

హోషేయ 13:11

కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.

అపొస్తలుల కార్యములు 13:21

ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.

రోమీయులకు 13:3

ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme