Home 1 సమూయేలు 30:31 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 30 · Verse 31

తెలుగు బైబిల్

1 సమూయేలు 30:31

హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.

Book: 1 Samuel · Chapter: 30 · Verse: 31

Cross References

యెహోషువ 14:13

యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.

యెహోషువ 14:15

పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను.

యెహోషువ 15:13

యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.

2 సమూయేలు 2:1

ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

2 సమూయేలు 2:4

అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

2 సమూయేలు 4:1

హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచకయుండెను.

2 సమూయేలు 15:10

అబ్షాలోముమీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీ యుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme