Home 1 సమూయేలు 30:20 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 30 · Verse 20

తెలుగు బైబిల్

1 సమూయేలు 30:20

మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

Book: 1 Samuel · Chapter: 30 · Verse: 20

Cross References

సంఖ్యాకాండము 31:9

అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్ల లను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.

1 సమూయేలు 30:26

దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచియెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.

2 దినవృత్తాంతములు 14:15

మరియు వారు పసుల సాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱెలను ఒంటెలను సమ కూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

2 దినవృత్తాంతములు 20:25

యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొని పో గలిగినంతకంటె ఎక్కువగా ఒలుచు కొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను.

యెషయా 53:12

కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

రోమీయులకు 8:37

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme