Home 1 సమూయేలు 15:17 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 15 · Verse 17

తెలుగు బైబిల్

1 సమూయేలు 15:17

అందుకు సమూయేలునీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.

Book: 1 Samuel · Chapter: 15 · Verse: 17

Cross References

న్యాయాధిపతులు 6:15

అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

1 సమూయేలు 9:21

అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.

1 సమూయేలు 10:1

అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొనియెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను

1 సమూయేలు 10:22

కావున వారుఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి యున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవాఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.

1 సమూయేలు 15:1

ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము

హోషేయ 13:1

ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.

మత్తయి 18:4

కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme