Home 1 రాజులు 6:16 · తెలుగు బైబిల్

1 రాజులు

Chapter 6 · Verse 16

తెలుగు బైబిల్

1 రాజులు 6:16

మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.

Book: 1 Kings · Chapter: 6 · Verse: 16

Cross References

నిర్గమకాండము 25:21

నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

నిర్గమకాండము 26:23

మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:33

ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

లేవీయకాండము 16:2

నేను కరుణాపీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.

1 రాజులు 6:5

మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మంది రపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.

1 రాజులు 6:19

యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపర చెను.

1 రాజులు 8:6

మరియు యాజకులు యెహోవానిబంధన మందస మును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.

2 దినవృత్తాంతములు 3:8

మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.

యెహెజ్కేలు 41:4

ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను.

యెహెజ్కేలు 45:3

కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థలముండును.

హెబ్రీయులకు 9:3

రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme