నిర్గమకాండము 22:27వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
2 సమూయేలు 16:5రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు
2 సమూయేలు 16:8ఛీపో, ఛీపో, నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా
2 సమూయేలు 19:16అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడ వచ్చెను.
2 సమూయేలు 19:17అతని యొద్ద వెయ్యిమంది బెన్యామీనీయులు ఉండిరి. మరియుసౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని పదు నయిదుగురు కుమారులును అతని యిరువదిమంది దాసులును వచ్చి
2 సమూయేలు 19:24మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.
1 రాజులు 2:36తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము.
యిర్మియా 4:2సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు.