Home 1 రాజులు 18:43 · తెలుగు బైబిల్

1 రాజులు

Chapter 18 · Verse 43

తెలుగు బైబిల్

1 రాజులు 18:43

తరువాత అతడు తన దాసుని పిలిచినీవు పైకిపోయి సము ద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడుఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.

Book: 1 Kings · Chapter: 18 · Verse: 43

Cross References

ఆదికాండము 32:26

ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

యెహోషువ 6:4

ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.

2 రాజులు 4:35

తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.

కీర్తనలు 5:3

యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

హబక్కూకు 2:3

ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.

లూకా 18:1

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

లూకా 18:7

దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?

ఎఫెసీయులకు 6:18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

హెబ్రీయులకు 10:36

మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme