1 రాజులు 18:31
యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని
1 రాజులు 18:31
యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని
అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
అప్పుడు యాకోబు - నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన - నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.
అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.
మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి
యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారి కాజ్ఞాపించుము
వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి
నేటి వరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడ కయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,
దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.
యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు.
నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారి దనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారి దనియు వ్రాయుము.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.