Home 1 రాజులు 14:3 · తెలుగు బైబిల్

1 రాజులు

Chapter 14 · Verse 3

తెలుగు బైబిల్

1 రాజులు 14:3

కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డితేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా

Book: 1 Kings · Chapter: 14 · Verse: 3

Cross References

1 సమూయేలు 9:7

అందుకు సౌలుమనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరి పోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసి కొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పిమనయొద్ద ఏమి యున్నదని అడుగగా

1 రాజులు 13:7

అప్పుడు రాజునీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా

2 రాజులు 1:2

అహజ్యా షోమ్రో నులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియైమీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయిఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా

2 రాజులు 4:42

మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.

2 రాజులు 5:5

సిరియా రాజునేను ఇశ్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొని పోయి ఇశ్రా యేలురాజునకు పత్రికను అప్పగించెను.

2 రాజులు 5:15

అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహు మానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా

2 రాజులు 8:7

ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియై యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని

2 రాజులు 8:8

హజాయేలును పిలిచినీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయిఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.

2 రాజులు 8:9

కాబట్టి హజా యేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచినీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదునాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను.

లూకా 7:2

ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను.

యోహాను 4:47

యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.

యోహాను 11:3

అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme