Home 1 కొరింథీయులకు 6:16 · తెలుగు బైబిల్

1 కొరింథీయులకు

Chapter 6 · Verse 16

తెలుగు బైబిల్

1 కొరింథీయులకు 6:16

వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

Book: 1 Corinthians · Chapter: 6 · Verse: 16

Cross References

ఆదికాండము 2:24

కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

ఆదికాండము 34:31

అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.

ఆదికాండము 38:15

యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని

ఆదికాండము 38:24

రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా - ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.

న్యాయాధిపతులు 16:1

తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.

మత్తయి 19:5

ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?

మత్తయి 21:31

అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మార్కు 10:8

వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.

ఎఫెసీయులకు 5:31

ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.

హెబ్రీయులకు 11:31

విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme