Home 1 కొరింథీయులకు 14:34 · తెలుగు బైబిల్

1 కొరింథీయులకు

Chapter 14 · Verse 34

తెలుగు బైబిల్

1 కొరింథీయులకు 14:34

స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.

Book: 1 Corinthians · Chapter: 14 · Verse: 34

Cross References

ఆదికాండము 3:16

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

సంఖ్యాకాండము 30:3

మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును.

ఎస్తేరు 1:17

ఏల యనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దానివిని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.

1 కొరింథీయులకు 11:3

ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.

1 కొరింథీయులకు 11:5

ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.

1 కొరింథీయులకు 11:7

పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.

1 కొరింథీయులకు 14:21

అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది.

1 కొరింథీయులకు 14:35

వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.

ఎఫెసీయులకు 5:22

స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.

ఎఫెసీయులకు 5:33

మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.

కొలస్సీయులకు 3:18

భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.

1 తిమోతికి 2:11

స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.

తీతుకు 2:5

మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.

1 పేతురు 3:1

అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme