Home 1 కొరింథీయులకు 1:25 · తెలుగు బైబిల్

1 కొరింథీయులకు

Chapter 1 · Verse 25

తెలుగు బైబిల్

1 కొరింథీయులకు 1:25

దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

Book: 1 Corinthians · Chapter: 1 · Verse: 25

Cross References

నిర్గమకాండము 13:17

మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.

నిర్గమకాండము 14:2

ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.

యెహోషువ 6:2

అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.

న్యాయాధిపతులు 7:2

యెహోవానీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులునా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.

న్యాయాధిపతులు 15:15

అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.

1 సమూయేలు 17:40

తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను.

1 రాజులు 20:14

ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడురాజ్యాధిపతులలో ఉన్న ¸యౌవనులచేత జరుగునని యెహోవా సెల విచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడునీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.

జెకర్యా 4:6

అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలు నకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.

జెకర్యా 12:7

మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.

రోమీయులకు 11:33

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

1 కొరింథీయులకు 1:18

సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

1 కొరింథీయులకు 1:27

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

2 కొరింథీయులకు 13:4

బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme