Home 1 దినవృత్తాంతములు 27:15 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 27 · Verse 15

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 27:15

పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Book: 1 Chronicles · Chapter: 27 · Verse: 15

Cross References

యెహోషువ 15:17

కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.

న్యాయాధిపతులు 3:9

ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రా యేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.

2 సమూయేలు 23:29

నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,

1 దినవృత్తాంతములు 4:13

కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.

1 దినవృత్తాంతములు 11:30

నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme