Home 1 దినవృత్తాంతములు 2:4 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 2 · Verse 4

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 2:4

మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.

Book: 1 Chronicles · Chapter: 2 · Verse: 4

Cross References

ఆదికాండము 38:11

అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి యింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.

ఆదికాండము 38:13

దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను.

ఆదికాండము 38:29

అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీ వేల భేదించుకొని వచ్చితి వనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.

ఆదికాండము 38:30

తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.

సంఖ్యాకాండము 26:13

జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు.

సంఖ్యాకాండము 26:20

యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;

రూతు 4:12

ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ ¸యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.

రూతు 4:18

పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,

1 దినవృత్తాంతములు 4:1

యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.

1 దినవృత్తాంతములు 9:4

యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.

1 దినవృత్తాంతములు 9:6

జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,

నెహెమ్యా 11:4

మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.

నెహెమ్యా 11:24

మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.

మత్తయి 1:3

యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను

లూకా 3:33

నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme