Home 1 దినవృత్తాంతములు 19:3 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 19 · Verse 3

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 19:3

అమ్మోనీయుల యధి పతులు హానూనుతోనిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా

Book: 1 Chronicles · Chapter: 19 · Verse: 3

Cross References

ఆదికాండము 42:9

యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని - మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా

యెహోషువ 2:1

నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించిమీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడదిగగా

న్యాయాధిపతులు 1:23

పూర్వము లూజనబడిన బేతే లును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా

న్యాయాధిపతులు 18:2

ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థు లందరిలోనుండి పరాక్రమ వంతులైన అయిదుగురు మను ష్యులను జొర్యా నుండియు ఎష్తాయోలునుండియు పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితోచెప్పగా

న్యాయాధిపతులు 18:8

వారు జొర్యా లోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారుమీ తాత్పర్యమేమిటని యడిగిరి.

1 సమూయేలు 29:4

అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడిఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవు నేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధాన పడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.

1 సమూయేలు 29:9

అందుకు ఆకీషుదైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులుఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.

1 రాజులు 12:8

అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸యౌవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను

1 కొరింథీయులకు 13:5

అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme