ద్వితీయోపదేశకాండము 27:15మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగా ఆమేన్ అనవలెను.
1 రాజులు 8:15నా తండ్రియైన దావీదు నకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక.
1 రాజులు 8:56ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు
నెహెమ్యా 8:6ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి.
నెహెమ్యా 9:5అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి - సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.
కీర్తనలు 72:18దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
కీర్తనలు 106:48ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.
యిర్మియా 28:6ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారి నందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక.
1 కొరింథీయులకు 14:16లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును?
ఎఫెసీయులకు 1:3మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
1 పేతురు 1:3మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.