1 సమూయేలు 25:18అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంస మును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి
2 సమూయేలు 16:1దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొని వచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసి యుండెను.
2 సమూయేలు 17:27దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీ యుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగుషోబీయును, లోదెబారు ఊరివాడగు అమీ్మయేలు కుమారు డైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు
1 రాజులు 1:40మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధిక ముగా సంతోషించిరి.
2 రాజులు 11:20మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులంద రును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.
1 దినవృత్తాంతములు 29:22ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.
సామెతలు 11:10నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
సామెతలు 29:2నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
యిర్మియా 23:5యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
లూకా 19:37ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
ప్రకటన గ్రంథము 19:5మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.